ఐటీడీఏ ప్రత్యేక ప్రచార విభాగం సహాయ ప్రాజెక్టు అధికారిగా పదవీ విరమణ చేసిన పి. రాములు సేవలు మార్గ నిర్దేశమని పాడేరు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నాగరాజ్ గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయనను ఘనంగా సత్కరించారు.ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారం చేరవేయడంలో ఆయన చేసిన ముఖ్య పాత్రను కొనియాడుతూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఐటిడిఏ పరిధిలో సుదీర్ఘకాలం సేవలు అందించారని, 2012 నుండి 2016 వరకు ఐటీడీఏలో డీఎస్ఓగా విధులు నిర్వహించారని ఆయన్ని ప్రశంసించారు.