చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతూ ఉంది . దీంతో ప్రాజెక్టులో 22 గేట్లను మంగళవారం ఉదయం రెండు అడుగుల ఎత్తున ఉంచి వరద నీటిని విడుదల చేశామని ఏఈ ఉపేందర్ తెలిపారు.జలాశయంలో 29 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నామని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఇది ఇలా ఉండగా భద్రాచలం వద్ద కొద్ది రోజులుగా గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతుంది .మంగళవారం ఉదయం 8 గంటలకు 27.6 అడుగులకు చేరింది. ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షపాతం నమోదు కావడంతో భద్రాచలానికి ఎగువన ఉన్న ప్రాణహిత వైపు నుంచి వరద చేరుతుంది