ఆదిలాబాద్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శాంతినగర్ లోని శ్రీ సిద్ది వినాయక గణేష్ మండపం వద్ద శుక్రవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల సూచనలకు అనుగుణంగా మహిళలు పూజలు చేశారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.