అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలం కృష్ణపాడు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అదే గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతము అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.