రోడ్లు-భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం రాయచోటికి విచ్చేశారు. రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆయనను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సుపరిపాలన అంశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు.