రైతులకు మార్కెట్ యార్డ్ ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని విషయంపై తాము ఆలోచిస్తున్నామని చిలకలూరిపేట మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పీళ్లి కోటేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాడిపంటలు పండించే రైతులకు పశు దాణ అందించే విషయంపై సచివాలయ సిబ్బందితో మాట్లాడాలని ఆదేశించారు.