వెంకటాపూర్ మండలం కేశాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం 6 గంటలకు క్యూలైన్లో నిలుచుని టోకెన్ తీసుకున్నప్పటికీ రాత్రి 7గంటల వరకు కూడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్లో నిలుచుకునే ఓపిక లేక రైతుల పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో యూరియా అంది విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.