వేములకుర్తిలో మారమ్మ తల్లికి బోనాలు, పోతరాజుల విన్యాసాలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో 16 కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం మారమ్మ తల్లి, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులలో అమ్మవారికి బోనం, చీర, సారెలు, పూజా సామగ్రిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు చల్లగా ఉండాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పోతరాజులు పాల్గొన్నారు.