జమ్మికుంట: పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కోలగాని రాజు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశద్రోహి కాకుండా ఒక భారతీయునిగా భారత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెప్పకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.