మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో తిమ్మాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో పొలం పనులకని వెళ్లిన రైతు కుమార్ వాగుమధ్యలో బుధవారం చిక్కుకుపోయాడు గమనించిన స్థానిక తోటి రైతులు తాడు సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.దీంతో రైతు కుమార్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.రేగోడు మర్పల్లి మరియు అల్లాదుర్గం రేగోడు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.