పెనుమల్లి సొసైటీ వద్ద రైతుల ఆగ్రహం స్తానిక పెడన మండలంలోని పెనుమల్లి సహకార సంఘం వద్ద ఆదివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో జరిగిన యూరియా పంపిణీ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలకొండపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ..పది ఎకరాల వ్యవసాయానికి 45 కిలోల యూరియాఎలా సరిపోతుంది? అంటూ ప్రశ్నించారు. అధికారులు, రాజకీయ నాయకులు యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ, రైతులకు సరిపడా యూరియా అందకపోవడం పై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.