ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించిన వారిని వదిలి చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సుధాకర్ మాదిగ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఈ విషయమై మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు తాత్కాలిక కూరగాయల మార్కెట్ పెద్దమ్మ దేవస్థానం వద్ద గతంలో మున్సిపల్ స్థలంలో రూములు వున్నాయని తొలగించారని, కాగా ప్రస్తుతం అక్కడ వున్న తోపుడు బండ్ల వ్యాపారస్తులను కూడా అక్కడ వ్యాపారాలు చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తెలిపారు.