ప్రముఖ ఫార్మా కంపెనీ వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ మంత్రి వెంకట సూర్య నాగవర ప్రసాద్ రాజు సోమవారం ఉదయం స్టీల్ ప్లాంట్ పరిధి ప్రగతి మైదాన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించినప్పటికీ ఆ వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ అని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.