మామిడికుదురు మండలంలో గోదావరి వరద ఉద్ధృతి ఆదివారం ఉదయానికి కాస్త తగ్గుముఖం పట్టింది. మండలంలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన పెదపట్నం, పెదపట్నం లంక, అప్పనపల్లి, పాసర్లపూడి లంక గ్రామాల ప్రజలకు గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో స్థానికులకు కాస్త ఊరట లభించింది.