ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కు తరలించిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన కావలి పాండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు భూముల రిజిస్ట్రేషన్ పేరుతో కుట్రపూరితంగా మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నిందితులు కాలకొండ మనోజ్ కుమార్, గడుదుల గణేష్, మురళి నాయక్ లు రైతులను నమ్మించి మోసపూరితంగా ఒక ఎకరా 16 గుంటల భూమిని నకిలీ రీతిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని మొత్తం డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు