భీమడోలు శ్రీమన్మహా గణపతి నవరాత్రి వేడుకలలో భాగంగా శుక్రవారం ఆలయం వద్ద ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, హెచ్ఎంగా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్డ్ అయిన గ్రామస్థులు తుమ్మల ఉమామహేశ్వరరావును కమిటీ సభ్యులు, గ్రామస్థులు, పూర్వవిద్యార్థులు సత్కరించారు. ఈ సందర్బంగా ఆలయ ఛైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.