బొండపల్లి పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మక్కువ మండలం వెంకట బైరిపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై వెళుతుండగా బొండపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న బొండపల్లి 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ముగ్గురిలో ఒకరు ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.