సెనర్జీస్ కార్మికులకు అండగా ఉంటామని విధసం ఐక్యవేదిక సభ్యులు ఏఐటీయూసీ జిల్లా సభ్యులు వెంకటరమన్నారు. ఐదు రోజులుగా సెనర్జీస్ కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెనర్జీస్ కార్మికుల ఆకలి కేకలు యాజమాన్యానికి వినపడట్లేదా 7 నెలలగా జీతాలు లేక ఆకలి తాలమటిస్తున్న కార్మికులకు కనీసం యాజమాన్యం వచ్చి పరామర్శ కూడా చేయలేదంటే కార్మికులు అంటే అంత అలుసా అన్నారు. భారీ మెజార్టీతో నెగ్గిన కోటను సభ్యులు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కల్పించుకుని వీరి సమస్యను పరిష్కరించాలని అలా చేయని పక్షంలో ఈ పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.