రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో భాగంగా చింతకొమ్మ దిన్నె మండలంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ ప్రారంభంతో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడానికి మరింత సమర్థవంతమైన సదుపాయాలు కలుగుతాయని తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.