కామారెడ్డి జిల్లా బిక్కనూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం బిజెపి పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బిక్కనూరు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు .రైతులకు యూరియా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.. అనంతరం ఎమ్మార్వో కి వినతి పత్రాన్ని అందజేశారు.