నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో పని చేస్తున్న సింగరేణి ఎన్టీపీసీ ఎఫ్సీఐ ఈసీఐఎల్ బీడీఎల్ డిహెచ్ఈఎల్ గ్రామపంచాయతీ మున్సిపల్ ప్రభుత్వ హాస్పిటల్స్, విద్యాసంస్థలు తదితర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు కేం వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ,వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్కు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్ధన్ శనివారం తెలిపారు.