బిక్కనూరు మండలంలో భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో మండల వైద్యాధికారి హేమ ఆదేశాల మేరకు భిక్కనూరు మండలం అయ్య వారిపల్లి గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యురాలు పూజ గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.