ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం సాయంకాలం ఐదు గంటలకు నిర్వహించారు. అక్టోబర్ మొదటి వారం నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో గన్ని సంచులు, సిబ్బంది, శిక్షణా తరగతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చెయ్యనున్నట్లు తెలిపారు.