మైదుకూరులోని తెలుగు గంగా సబ్‌స్టేషన్‌లోని 12 కేవీ సరస్వతిపేట ఫీడర్‌పై శనివారం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీనివల్ల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆ శాఖ ఏఈ భద్రయ్య తెలిపారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అసౌకర్యానికి సహకరించాలన్నారు.