నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... నార్త్ రాజుపాలెంలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి బహబాహి తలపడ్డారు. విద్యార్థుల అరుపులు, ఘర్షణ వాతావరణంతో స్థానిక గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో అంటూ తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఘర్షణలో ముగ్గురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. కారు స్వల్పంగా ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులతో స్థానిక యువకులు కొందరు కలిసి ఇట్లాంటి ఘర్షణ వాతావరణం సృష్టించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తు