శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ కు చెందిన కోరాడ గవరయ్య (35) మంగళవారం ఉదయం పదునైన ఆయుధంతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.