భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్లు కొరత వేధిస్తుంది. ఏలూరు DCHS పరిధిలో పనిచేసే ఈ ఆసుపత్రిలో ఏడుగురు వైద్యులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విధులకు హాజరువుతుందడం, మిగిలిన వైద్యులలో ఒకరిద్దరు సెలవులో ఉండడం మిగిలిన పోస్టులు భర్తీ కాకపోవడంతో ఆసుపత్రిలో వైద్యులులేక ఆసుపత్రికి వచ్చిన రోగులు నానాఅగచాట్లు పడుతున్నారు. విధులకు హజరైన ఒకరిద్దరు డాక్టర్ లు పనిచేస్తున్నా, ప్రస్తుతం రెయినీ సీజన్ కావడం, గ్రామాల్లో జ్వరాలు తీవ్రత ఉండడంతో ఆసుపత్రికి పెద్దఎత్తున రోగులు రావడంతో ఆసుపత్రి కిక్కిరిసిపోతుంది.