గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో అడవి భూములపై వచ్చిన ఫిర్యాదు మేరకు భూములను పరిశీలించిన జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ గారు. పట్టా భూమి ఉన్న ప్రతి రైతులకు బావులు తవ్వడానికి అనుమతి ఇవ్వాలని,మట్టితల్లిని నమ్ముకొని జీవిస్తున్న రైతుల భూములు వరంగల్ మరియు మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో కొంతమందికి ROFR పట్టాలు మంజూరు కాలేదని, సంబంధిత అధికారులు రైతుల పక్షాన ఆలోచించి అప్లికేషన్స్ తీసుకొని వారికి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు MRO గారు, ఫారెస్ట్ శాఖ అధికారులు,స్థానిక నాయకుల, తండా ప్రజలు,యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..