నెల్లూరు జిల్లా, సైదాపురం మండలంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపురా సుందరీదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి రాహుకాలం పూజలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా శిరీష నాయుడు, సుకన్య సింగ్ వ్యవహరించారు.