సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా కురిసిన వర్షంతో సత్తెనపల్లి నుండి అమరావతి వెళ్లే రహదారిలోని గుడిపూడి వాగు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో పొంగిపొర్లుతుంది. బ్రిడ్జిపై నుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ స్తంభించింది గతంలో కూడా గుడిపూడి వాగుపై ప్రయాణం కొనసాగించిన సమయంలో ద్విచక్ర వాహనాలు వాగులు కొట్టుకుపోయాయి. వాహనదారుల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.