భీమిలి బీచ్ కోత నివారణకు రూ. 210 కోట్లతో రిటైనింగ్ వాల్ సహా ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి భీమిలి పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ కోత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులకు రక్షణ చర్యలతో చెక్ పడుతుందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ప్రాంతంలో నీటి ఎద్దడి నివారణకు రూ.595 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు.. మురుగు నీటి సమస్యను అధిగమించడానికి రూ. 292 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.