నల్లగొండ పట్టణంలోని వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రామగిరి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని జిల్లా ప్రతి కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.