సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఆవాసంకు శాశ్వత బియ్యం దాతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత చేతుల మీదుగా వాల్మీకి ఆవాసానికి 60 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ....గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చక్కటి వసతి, భోజనం ఇతర సదుపాయాలు కల్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారిని...