మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబి పండుగను పురస్కరించుకుని దేవనకొండలో ముస్లింలు శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద మసీద్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రవక్త సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చారని వారు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.