పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కొండాపూర్ మండలం పల్లి గ్రామంలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, తహసిల్దార్ అశోక్, ఎంఈఓ దశరథ్ పాల్గొన్నారు.