గట్టు మండల అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా మంజూరైన కోటి రూ" నిధుల నుండి 70 లక్షలతో అధునాతన భవన నిర్మాణం పనులను చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.గురువారం మధ్యాహ్నం గట్టు మండల కేంద్రంలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండల అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకు స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మెమెంటో, సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు.