ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆహ్వానం మేరకు ఆదివారం కామారెడ్డి పట్టణంలోని జి ఆర్ కాలనీలో రామకృష్ణ మాట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురి కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.