గోదావరి వరద ఉద్ధృతికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రభావంతో నది కోత తీవ్రమైందని రైతులు వాపోయారు. వరద ప్రవాహానికి కొబ్బరి చెట్లు, నది ఒడ్డు అండలండలుగా కూలిపోతున్నాయని, రివిట్మెంటు, గ్రోయన్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.