అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం, సి.ఎం.రాచపల్లి గ్రామానికి చెందిన గుండ్రాటి శంకరయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.47,900/- మంజూరైన చెక్కును వారి స్వగృహం నందు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* అందజేశారు. ఈ సందర్భంగా *అరవ శ్రీధర్ మాట్లాడుతూ* “ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలబడటమే మా కర్తవ్యం. అవసరంలో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తాం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలు వింటూ వాటిని పరిష్కరించడం మా ప్రధాన ధ్యేయం” అని తెలిపారు. ఈ కార్యక్రమాలు కూటమి నేతలు పాల్గొన్నారు.