జిల్లా దర్శి పట్టణంలో సెప్టెంబర్ రెండో తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. టిడిపి దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాన్ని గొట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించినట్లు తెలిపారు. ఇందులో 30కి పైగా ప్రముఖ కంపెనీలో పాల్గొంటున్నారని పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు.