నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో గురువారం ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా గురువారం రైతు మాట్లాడుతూ శాలిగౌరారం మండల కేంద్రంలో గత నెల రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని అర కొర యూరియా రావడంతో యూరియా సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగానికి యూరియా ఎంత అవసరం పడుతుందో కూడా కనీసం అవగాహన లేదని దద్దమ్మ ప్రభుత్వం అని ఆరోపించారు.