కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువులో శుక్రవారం గల్లంతైన యువన్ శంకర్ మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. రెండు రోజులు పాటు చెరువులో సిబ్బంది యువకుడు ఆచూకీ కోసం విస్తృతంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం మరో మారు చెరువులో గాలింపు చేపట్టారు. యువన శంకర్ మృతదేహాన్ని వెలికితీయగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.