తిరుపతి జిల్లా బాలాయపల్లి (మం)లోని ఊట్లపల్లి గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులును మంగళవారం పిడి శ్రీనివాస ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఉపాధి హామీ కూలీలలను పని దినాలు, తదితర వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జ్యోతి,ఈ సి సుధీర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు దొరసానమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ శివ,ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.