ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ముఖ్య ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలం పెరిగి బోర్లకు నీరు పుష్కలంగా వస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ప్రతినెల ఒకటో తేదీ జీతాలు పింఛను కూటమి ప్రభుత్వం ఇస్తుందన్నారు.