రాజుపాలెం మండలంలోని కొండమోడు గ్రామ పరిధిలో ఉన్న వీరమ్మ కాలనీలో చోరీ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇంటి యజమాని రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లారని, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, 20వేల రూపాయలు నగదు అపహరించారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.