ద్విచక్ర వాహనంపై వస్తు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం వంగూరు గేటు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం అక్కారం తండాకు చెందిన బాలునాయక్ అతని భార్య కలకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కల్వకుర్తి పట్టణానికి వెళ్లి నాటు మందులు తీసుకుని తిరిగి వస్తుండగా వంగూరు గేటు సమీపంలో ప్రమాదవశాత్తు విచక్ర వాహనంపై నుండి కింద పడటంతో కళా అక్కడికక్కడే మృతి చెందింది.