నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో శుక్రవారం పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. కిసాన్ గల్లీలోని రొకడేశ్వర హనుమాన్ ఆలయం చుట్టూ రైతులు తమ బసవన్నల ప్రదక్షిణలు చేయించారు. అక్కడ నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాష్ కుమార్ లు పూజలు చేశారు.