సోంపేటలో గల నిమ్మాసిని అమ్మవారి 6 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి. బుధవారం అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. రాత్రికి జాతర మహోత్సవ కార్యక్రమం ఉంటుందని కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.