రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల కనికరం లేకుండా కూటమి ప్రభుత్వం రెండు బుక్ పాలన అమలు చేస్తూ వేధిస్తుందని సత్తనపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి సుదీర్ భార్గవ్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ టిడిపికి చెందినవారు కాదన్న కారణంతో పెన్షన్లు తొలగించడం అన్యాయం అంటూ పేర్కొన్నారు. దాదాపు 6000 మందికి నోటీసులు ఇచ్చారని వైకల్య శాతాన్ని తగ్గించి పెన్షన్ మొత్తాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.