దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న సదరం సర్టిఫికెట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబులిటీ ఐడి అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. సోమవారం సాయంత్రం 5:30లకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడి ఇవ్వనుందన్నారు.